Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలలో చిన్నారులను చేర్పించండి

అంగన్వాడీలలో చిన్నారులను చేర్పించండి

- Advertisement -

సూపర్ వైజర్ శశికళ
నవతెలంగాణ – పెద్దవూర
అంగన్వాడీ కేంద్రాలేలోనే రెండు ఏండ్లు నుంచి మూడు ఎడ్ల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని అనుముల ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ శశికళ అన్నారు. శుక్రవారం పెద్దవూర మండలం ఈదులగూడెం అంగన్వాడీ కేంద్రం లోఅమ్మమాట -అంగన్వాడీ బడి బాట కార్యక్రమం నిర్వహించి రికార్డులు పరిశీలించి మాట్లాడారు. ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని అన్నారు. అంగన్వాడీ సెంటర్ కి చిన్నారులను పంపించి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని చెప్పారు. పుష్టికరమైన పౌష్టికాహారం, గుడ్లు, బాలామృతం, పాలు, మురుకులు, మధ్యాహన్నం లబ్ధిదారులకు సన్నబియ్యంతో  రుచికరమైన భోజనం అంగన్వాడీ కేంద్రాలలోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా, అంగన్వాడీ లబ్ధిదారులు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -