Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి: ఎంపీడీవో

వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ 
వేసవి కాలాన్నీ దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. సోమవారం త్రాగునీటి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్స్, పంచాయతీ కార్యదర్శులతో రాబోయే వేసవిలో ప్రజలు ఎలాంటి త్రాగునిటి సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.

త్రాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని, రిపేరు చేయాల్సిన బోర్ మోటార్లు ఏమైనా ఉంటే వాటిని రిపేరు చేయించుటకు, పైపు లైన్ లీకేజిలు బాగుచేయించుటకు, హ్యాండ్ పంపులు రేపేరు చేయించుటకు, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయుటకు లీజ్ బోర్లు మాట్లాడుకొని సిద్ధంగా ఉండాలని అన్నారు. అలాగే అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టి గ్రామాలను పరిశుభ్రతతో ఉంచుటకు చర్యలు  తీసుకోవాలన్నారు. సందర్శనలో మండల్ లెవెల్ టీం సభ్యులు ఏఈ రోహిత్, ఎంపీఓ లక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -