ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణం. ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో నిర్మాతలు శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా ఈనెల 25న విడుదల కానుంది. ఈనేపథ్యంలో గురువారం దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ చిత్ర కథ నాకు మున్నా చెప్పారు, కథ చాలా బాగుంది.
క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు’ అని అన్నారు. ‘ఇది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమిది. సినిమా చాలా కొత్తగా ఫ్రెష్‌గా ఉంటుంది. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించగా, చంద్ర బోస్ అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. ఇటీవల విడుదల అయిన ‘ఇలా చూసుకుంటానే’, ‘లేలో’, బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్స్‌కి మంచి ఆదరణ లభించింది’ అని దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి చెప్పారు.
ఆద్యంతం వినోదభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



