Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అలరించిన విద్యార్థుల నృత్యాలు

అలరించిన విద్యార్థుల నృత్యాలు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
బాల్కొండ మండల కేంద్రంలోని మదర్ తెరిసా హైస్కూల్లో శనివారం జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు, వార్షికోత్సవ సభలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ట్రెండింగ్ లో ఉన్న జానపద పాటలకు మదర్ తెరిసా శ్రీ వేంకటేశ్వర హై స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాల సందడి తల్లిదండ్రులను విశేషంగా అలరించాయి. వివిధ విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ ను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలను పాఠశాల కరస్పాండెంట్ కే రామలక్ష్మి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు తమ జ్ఞాపకాలను పాఠశాలల్లో గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ లు కే సుబ్బారెడ్డి , కె నరసింహారెడ్డి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -