Thursday, July 10, 2025
E-PAPER
Homeసినిమాఆద్యంతం అలరిస్తుంది

ఆద్యంతం అలరిస్తుంది

- Advertisement -

హీరో సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఃఓ భామ అయ్యో రామః. మలయాళ కథానాయిక మాళవిక మనోజ్‌ ఈ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమవుతోంది. రామ్‌ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. ఈనెల 11న ఈ చిత్రం థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరై, బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఃయూట్యూబ్‌ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్‌ జర్నీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌. తమిళంలో విజరుసేతుపతిలా తెలుగులో సుహాస్‌ కూడా అలాంటి స్టారే.. అన్ని తరహా సినిమాలను చేస్తాడు. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి బ్రేక్‌ నివ్వాలిః అని అన్నారు. ఃఈ సినిమా చూసిన తరువాత మాళవిక ప్రేమలో పడిపోతారు. అలీ, అనిత, పథ్వీ లాంటి సీనియర్‌ ఆర్టిస్ట్‌లతో నటించడం ఎంతో హ్యపీగా ఉంది. ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌లో తల్లి, భార్య ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్‌ ఈ చిత్రంలో అందరి హదయాలను హత్తుకుంటాయిః అని హీరో సుహాస్‌ చెప్పారు.
నిర్మాత హరీష్‌ నల్లా మాట్లాడుతూ, ఃదర్శకుడు మంచి టీమ్‌ను సెట్‌ చేసుకున్నాడు. అందువల్లే మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. రామ్‌కు దర్శకుడిగా మంచి భవిష్యత్‌ ఉంటుంది. సినిమా చూశాను. కొత్త దర్శకుడిలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడు.ఈ చిత్రంలో సుహాస్‌ పర్‌ఫార్మెన్స్‌ మరో రేంజ్‌లో ఉంటుందిః అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -