సతీష్ నీనసాం హీరోగా, ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. కన్నడ, తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్, సతీష్ పిక్చర్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ పతాకంపై రవిశంకర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 27న అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈనేపథ్యంలో హీరో సత్యదేవ్ ముఖ్యఅతిథిగా ఈచిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
సత్యదేవ్ మట్లాడుతూ,’కన్నడ నుంచి వచ్చే రూటెడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఇష్టం. తప్పకుండా ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని అనుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్‌కి మంచి కంటెంట్ ఇస్తే విజయాన్ని ఇస్తారు’ అని అన్నారు. ‘తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ నెల 27న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో గ్రాండ్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత చెప్పారు. కళా సృష్టి అధినేత రవిశంకర్ మాట్లాడుతూ,’ఏపీ, తెలంగాణతో పాటు ఒరిస్సాలో నా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాను. తెలుగులో విడుదల చేయడం ఎంతో గర్వంగా ఉంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అయ్యే సినిమా ఇది’ అని చెప్పారు.
అలరించే యూనిక్ కంటెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



