Friday, March 20, 2026
E-PAPER
Homeసినిమావినోదంతోపాటు మంచి సందేశం

వినోదంతోపాటు మంచి సందేశం

- Advertisement -

కంపోజర్‌-హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌ నటించిన నూతన చిత్రం ‘హ్యాపీ రాజ్‌’. హీరో- డైరెక్టర్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్‌ దర్శకత్వం వహించారు. బియాండ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై జైవర్ద నిర్మించారు. ‘మ్యాడ్‌’ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్పీ ద్వారా ఈనెల 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. డైరెక్టర్స్‌ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు.

హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని సోషల్‌ మీడియాలో లాంచ్‌ చేసిన రవితేజకి థ్యాంక్యూ సో మచ్‌. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను చూశారు. వాళ్లకి చాలా నచ్చింది. మైత్రి మూవీస్‌ ద్వారా ఈ సినిమా రిలీజ్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఫన్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి. అలాగే ఒక బ్యూటీఫుల్‌ మెసేజ్‌ ఉంది. సినిమా చూసిన తర్వాత ఈ కథ మీ మనసులను హత్తుకుంటుంది. చాలా స్పెషల్‌ ఫిలిం. మీరందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్‌ హీరో. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్‌ని సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది. చాలాకాలం నిలిచిపోతుంది’ అని అన్నారు.

‘ఈ సినిమా చూశాం. చాలా మంచి ఎంటర్టైన్మెంట్‌తో పాటు గొప్ప మెసేజ్‌ ఉంటుంది. సీన్స్‌ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్‌, మదర్‌ని చూసే విధానంలో మార్పు ఉంటుంది. ఇది తెలుగులో కచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది’ అని మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి చెప్పారు. మూవీ డైరెక్టర్‌ మరియా రాజా మాట్లాడుతూ,’ఈ సినిమా కేవలం నవ్వించడమే కాదు చాలా ఎమోషన్స్‌ని టచ్‌ చేస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -