ఈటీవీ విన్‌తో కలిసి నైన్టీస్ కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ హైదరాబాద్‌లో జరిగిన పూజా వేడుకతో తమ తొలి ప్రొడక్షన్‌ని లాంచ్ చేసింది. నిర్మాత రవిశంకర్ (మైత్రి మూవీ మేకర్స్) కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టారు, నిర్మాత ఎస్‌కేఎన్ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. బన్నీ వాస్, మెహర్ రమేష్, ప్రసాద్ నిమ్మకాలయ, నిఖిల కోనేరు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. వినోద్ గాలి దర్శకత్వంలో నైన్టీస్ కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ చంద్ర నాయుడు నిర్మించిన ఈ ప్రాజెక్ట్ బలమైన భావోద్వేగాలతో కూడిన బడ్డీ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ఇది అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. విరాజ్ అశ్విన్, ప్రియ దర్శిని రామ్, బాబు మోహన్, యశశ్రీరావు, పవన్ సిద్ధు, టేస్టీ తేజ, సూర్య గోపీనాథ్, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన- దర్శకత్వం: వినోద్ గాలి, నిర్మాత: శరత్ చంద్ర నాయుడు, ఈటీవీ విన్ టీమ్: సాయి కష్ణ కోయిన్ని, నితిన్ చక్రవర్తి, ప్రమదేష్ వి, సహ నిర్మాత: మనీష్ పల్లె, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రెహాన్ షేక్, ఎడిటర్: వెంకటేష్ చుండూరు, సంగీతం: సుహాస్, ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ, డైలాగ్ రైటర్: రాజశేఖర్ బద్దం, కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి.
అన్ని వర్గాలనూ అలరిస్తుంది
- Advertisement -
- Advertisement -