Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం16న బెంగళూరులో.. ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇండియా ఐడియా అవార్డుల ప్రదానం

16న బెంగళూరులో.. ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇండియా ఐడియా అవార్డుల ప్రదానం

- Advertisement -

– ముఖ్యఅతిథిగా కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బెంగళూరులో ఈనెల 16న ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇండియా ఐడియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) హాజరు కానున్నారు. నవకల్పనలు, పారిశ్రామిక వృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈనెల 16న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని షెరటన్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 300 మందికిపైగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, అంకుర సంస్థల (స్టార్టప్‌) వ్యవస్థాపకులు, వ్యాపార రంగ నిపుణులు ఒకే వేదికపైకి రానున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న దార్శనిక నాయకులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో కేటీఆర్‌ చూపిన డైనమిక్‌ నాయకత్వాన్ని నిర్వాహకులు ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన హయాంలో తీసుకొచ్చిన ప్రగతిశీల విధానాలు, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చాయని ఆహ్వాన పత్రంలో వారు పేర్కొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించాలనీ, ఆయన మాటలు భావి పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహం కలగాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చడంలో కేటీఆర్‌ పోషించిన కీలక పాత్రకు, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన కృషి నేపధ్యంలో ఈ ఆహ్వానం దక్కింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -