Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డా.కవిత

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డా.కవిత

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
మండల ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా జీవించాలని డాక్టర్ కవిత అన్నారు. శుక్రవారం మండలంలోని దేవనూరు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంలో డ్రైడే కార్యక్రమాన్ని ఏఎన్ఎం ఎస్ విజయ ఎన్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దోమల నివారణకై నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో వేస్టైన ఆయిల్ వేయించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ జ్వరం లపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు దోమలు కుట్టకుండా దోమతెరలు మరియు వేప పొగలాంటివి ఉపయోగించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎవరికైనా జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా ఆరోగ్య కేంద్రాన్నీ సందర్శించి రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -