సీజనల్ వ్యాధి నుండి బయటపడాలంటే జాగ్రత్తలు పాటించాలి
కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ బంటు కవిరాజు
నవతెలంగాణ – నెల్లికుదురు
పరిసరాల పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ బంటు కవిరాజు అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళమొక్కులను తొలగించారు.
అనంతరం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా లేకపోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని విద్యార్థులకు సూచించారు. వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, బాబు, యాకన్న, సతీష్, సుభాష్, రామ్మూర్తి అధ్యాపకేతర బృందం సైదా, లక్ష్మణ్, గౌరీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అజయ్, సలీం, కిరణ్, సాయి, నవ్య, మౌనిక, అక్షిత తదితరులు పాల్గొన్నారు.