Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీ చేతుల మీదుగా ఈఓడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

సీపీ చేతుల మీదుగా ఈఓడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతీ చేతుల మీదుగా ఆర్థిక నేరాల విభాగాన్ని (ఈఓడబ్య్లూ) ప్రారంభించారు. బుధవారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నేరేడ్‌మెంట్‌లోని మల్కాజ్‌గిరి పోలీస్‌ క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. రూ. 2కోట్లకు మించిన ఆర్థిక నేరాల కేసులను ఇందులో రిజిస్ట్రర్‌ చేస్తారు.

డీసీపీ కే.మనోహర్‌ ఆధ్వర్యంలో ఏసీపీలు పి.సత్తయ్య, సి.అంజయ్యతోపాటు ఇన్‌స్పెక్టర్లు కె.భాస్కర్‌, సూర్యనాయక్‌, కె.రవికుమార్‌ పనిచేస్తారు. వీరి ఆధ్వర్యంలో ఈఓడబ్య్లూ (ఆర్థిక నేరాల విభాగం) పనిచేయనుంది. ఫైనాన్స్‌ మోసాలు, డాక్యుమెంట్లను మార్చి మోసాలకు పాల్పడుతున్న కేసులతోపాటు కమిషనర్‌ ఆదేశించిన కేసులను రిజిస్ట్రర్‌ చేయడంతోపాటు విచారణ కొనసాగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -