నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో గతనెల 29న ప్రారంభమయ్యాయి. గతనెల 30 వరకు ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 86,762 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే 81,198 మంది హాజరయ్యారు. శుక్రవారం నుంచి ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆదివారం వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మూడు రోజులపాటు ఆరు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తారు. ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,20,117 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
- Advertisement -