Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపర్యావరణంపై అవగాహనకల్పనలో ఈపీటీఆర్‌ఐదే కీలక పాత్ర

పర్యావరణంపై అవగాహనకల్పనలో ఈపీటీఆర్‌ఐదే కీలక పాత్ర

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ(ఈపీటీఆర్‌ఐ)ది కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన తరగతులు, జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు, పబ్లికేషన్స్‌ ప్రచురణలు మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈపీటీఆర్‌ఐ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధన, శిక్షణ, సామర్థ్యవృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా పర్యావరణ అనుకూల కార్యక్రమాలను వేగవంతం చేయాలనీ, వివిధ శాఖలతో సమన్వయం పెంచాలని ఆయన సూచించారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి, వాయు కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపకం వంటి అంశాల్లో ఈపీటీఆర్‌ఐ మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే. శ్రీదేవి, బోర్డ్‌ మెంబర్లు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -