ఎల్డీఎఫ్ పాలనలోనే అది సాధ్యం : ఏఐఏడబ్య్లూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సంక్షేమం, అభివృద్ధికి ఎల్డీఎఫ్ సమాన ప్రాధాన్యత ఇస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్య్లూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ చెప్పారు. అది ఎల్డీఎఫ్ పాలనలోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు తాము గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధిని, గ్రామాల వారీగా ఖర్చు చేసిన నిధులను, ఇచ్చిన హామీల అమలును పుస్తక రూపంలో ముద్రించి ప్రతి కుటుంబానికి అందజేశారని తెలిపారు. ఇది దేశ రాజకీయాల్లోనే ఒక అరుదైన ప్రజాస్వామ్య విప్లవమని పేర్కొన్నారు. శుక్రవారం కేరళంలోని పాలక్కడ్ జిల్లా పొరనూర్ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ అభ్యర్థి ముమ్మకుట్టికి ఓటు వేయాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అభివృద్ధి నివేదికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ తరఫున భారీ మెజార్టీతో గెలిచిన ఏఐఏడబ్య్లూయూ నేత ముమ్మకుట్టి తన నియోజకవర్గంలో ప్రతి పైసాకు లెక్క చెబుతూ నివేదిక విడుదల చేయడం అభినందనీయమన్నారు. అధికార ధీమాతో ఎల్డీఎఫ్ ప్రజల ముందుకు వస్తుంటే, అబద్ధాలు నమ్ముకున్న యూడీఎఫ్, బీజేపీలు నేడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి ముందుగా తన కండ్లకున్న బీజేపీ కండ్లజోడు తీసి చూడాలి. అప్పుడే కేరళంలో జరిగిన అసలైన అభివృద్ధి కనిపిస్తుంది. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, ఆ కండ్లజోడు పెట్టుకుంటే నిజాలు కనిపించవు’ అని ఎద్దేవా చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేరళ ప్రభుత్వంపై కక్ష గట్టి వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా ఆపినా, పరిమిత వనరులతోనే అద్భుతమైన ప్రజాపాలన అందించిన ఘనత పినరయి విజయన్ ప్రభుత్వానిదేనన్నారు. న్యాయంగా రావాల్సిన నిధులు ఇచ్చి ఉంటే కేరళ మరిన్ని అద్భుతాలు సాధించి ఉండేదని ఆయన తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



