Sunday, February 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమానత్వ నిబంధనలను బలోపేతం చేయాలి

సమానత్వ నిబంధనలను బలోపేతం చేయాలి

- Advertisement -

హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాల ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

యూజీసీ సామాజిక సమానత్వ నిబంధనలను రోహిత్‌ వేముల చట్టం ఆధారంగా ఉన్నత విద్యలో వివక్షను పూర్తిగా అరికట్టేలా బలోపేతం చేయాలని పలు ప్రగతిశీల విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్‌, డీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్‌ల సంయుక్తాధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మైనార్టీ విద్యార్థులు హింసను, అసమానతలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా విద్యా సంస్థల వారీగా అణగారిన వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్ష నుంచి రక్షించేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ వర్గాల పిల్లలు విద్యాసంస్థల్లో హక్కులకు, ఆత్మగౌరవానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత విద్యలో సామాజిక న్యాయం కోసం రోహిత్‌ వేముల వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్వహించిన ప్రదర్శనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -