Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంత్యక్రియల్లో పాల్గొన్న ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ 

అంత్యక్రియల్లో పాల్గొన్న ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్            
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన క్షత్రియ సమాజ్ మాజీ అధ్యక్షులు హజారి అంతా జి మదన్ మోహన్ అంత్యక్రియలు బుధవారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. మదన్ మోహన్ గారు చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చెరుకుని క్షత్రియ సమాజ్ అధ్యక్షులుగా ఎన్నో సేవలను సమాజ్ కు అందించారన్నారు. ఆయన  తన వంతు సహాయంగా నిరుపేదలకు నిత్యం ఏదో రూపంగా సహాయం అందించే వారిని గుర్తు చేశారు. ఈ అంత్యక్రియల్లో ఫౌండేషన్ సభ్యులు సంధ్యా ఇంజనీరింగ్ సత్తన్న, సడక్ ప్రమోద్, జనతా ఎంటర్ప్రైజెస్ హైమద్ భాయ్, ఇస్తాకు దిన్, నూకల శేఖర్, ఓం ట్రేడర్ గంగమోన్, కర్త నవీన్, బంజారా రజనీష్ కిరాడ్,  టైలర్ వినోద్, విశ్రాంత ఉపాధ్యాయులు పుష్పకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -