No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత

మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత

- Advertisement -

ఏసిపి సదానందం 
నవతెలంగాణ – హుస్నాబాద్
: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హుస్నాబాద్ ఏసిపి సదానందం అన్నారు.  యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా సోమవారం హుస్నాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్ , జూనియర్ కాలేజ్ లో హుస్నాబాద్ ఏసిపి సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉందన్నారు.  కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు  వారి మానసిక స్థితిని కోల్పోయి  నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు.  గ్రామాలలో పట్టణాలలో  మారకద్రవ్యాల విషయములో  మారకద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని అన్నారు. డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్, స్కూల్ హెడ్మాస్టర్ వాసుదేవ రెడ్డి, కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ రాజు, ఉపాధ్యాయులు  విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad