ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హర్రర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుక రాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ఈనెల 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. సినిమా విడుదల నేపథ్యంలో హీరో అఖిల్ రాజ్ మంగళవారం మీడియాతో సంభాషించారు.
”రాజు వెడ్స్ రాంబాయి’ సక్సెస్ తరువాత కొంత గ్యాప్‌లోనే ‘ఈషా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా ఈ సినిమా విడుదల డేట్ కుదిరింది. ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఈ కథ వినగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ సూపర్బ్. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. కథ చెప్పినప్పుడు ఎంతగా ఉలిక్కి పడ్డానో, ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్. అందర్ని భయపెట్టే సినిమా ఇది. ఇందులో వినరు అనే పాత్ర చేశాను. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకడిని. త్రిగుణ్, సిరి, హెబ్బా పటేల్, మైమ్ మధు వంటి వారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. దర్శకుడు శ్రీనివాస్ రాగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. దానికి భద్రి దర్శకుడు’ అని హీరో అఖిల్ రాజ్ తెలిపారు.
కచ్చితంగా భయపెట్టే ‘ఈషా’
- Advertisement -
- Advertisement -



