- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జునరావు ఆదేశాల మెరకు తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మల్లారం కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల, ఎడ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు శనివారం డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులకు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండాలి అనే అంశాలపై వ్యాచారచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు త్వరలోనే బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
- Advertisement -



