- Advertisement -
నవతెలంగాణ- నాగిరెడ్డిపేట్
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో సిబ్బందికి, జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఎస్సై భార్గవ్ గౌడ్ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సిబ్బందికి పని ప్రదేశంలో లింగ వివక్షత” అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించగా, గోపాలపేట హైస్కూల్‌లో “డ్రగ్స్ అవగాహన – డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండాలి” అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు ఎస్ఐ భార్గవ్ కూడా తెలిపారు.
- Advertisement -