Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు బుధవారం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీల్లోs కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన   కే.హరీష్, మొదటి బహుమతి గెలుపొందగా, రెండవ బహుమతి ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మాధురి, మూడవ బహుమతి కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీజ గెలుపొందారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి ఆంధ్రయ్య చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాచారచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరినీ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను  అభినందించారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి  కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న,  వివిధ పాఠశాలల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -