– మండల అధ్యక్షులు లుక్క గంగాధర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఈ నెల 14న మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాచారచన పోటీలను నిర్వహిస్తున్నట్లు లైన్స్ క్లబ్ మండల అధ్యక్షులు లుక్క గంగాధర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.’మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం’ అనే అంశంపై ఈ వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 11గంటల నుండి 12గంటల వరకు ఈ పోటీలు కొనసాగుతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమెంటుతో సత్కరించి మొదటి బహుమతిగా రూ.1116, ద్వితీయ బహుమతిగా రూ.751, తృతీయ బహుమతిగా రూ.501 అందజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని లైన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో లైన్స్ క్లబ్ కోశాధికారి తెడ్డు రమేష్, సభ్యులు చింత ప్రదీప్, బద్దం రాజశేఖర్, చిలువేరి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES