Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్వీజ్ పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్వీజ్ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు TSAT, తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో వ్యాసరచన, ఉపన్యాస, క్వీజ్ పోటీలు ఎంఈఓ రాజగంగారెడ్డి నిర్వహించారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు.విద్యార్థులకు ఐడి కార్డు అందజేత….పట్టణ కేంద్రంలోని ఎంపీపీ ఎస్ హెచ్ డబ్ల్యు పాఠశాలలో చదువుతున్న 55 మంది విద్యార్థులకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ డాక్టర్ కిష్టయ్య స్టూడెంట్ ఐడీ కార్డులను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సంధానకర్తలు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఇంచార్జ్ హెచ్ఎం భవాని, వెంకటేశం, అనురాధ, సంధ్య, సీఆర్పీలు మహేందర్, సత్యం, ఈశ్వర్, సి ఓ సంపత్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -