సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని తుమ్మలకుంట తండాకు చెందిన హుస్సేన్ నాయక్ తిమ్మాజిపేట మండల సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ మాజీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 26 పంచాయతీలకు గాను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కృషి ఫలితంగా తమ పార్టీ బలపరిచిన 13 మంది గెలిచారన్నారు. మరికొందరు సర్పంచుల మద్దతుతో హుస్సేని మండల అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు వారు తెలిపారు. ఆయనకు పార్టీ తరపున అభినందనలు తెలిపారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని మండల అధ్యక్షుడు హుస్సేని నాయక్ తెలిపారు.
సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడిగా హుస్సేన్ నాయక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



