Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

- Advertisement -

– జిల్లా మార్కెటింగ్ అధికారి పి.రమ్య
నవతెలంగాణ – కామారెడ్డి
వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్నూర్ జిల్లా కామారెడ్డి ఆధీనంలో  7 జీన్నింగ్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫికేషన్ వేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్ అధికారిని పి రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా సీసీఐ వారి ఎల్ 1, ప్రకారం ఒక మిల్లు కెపాసిటీ వరకు ఆ మిల్లు మాత్రమే కనబడుతుందన్నారు. అక్కడికి  తీసుకొని వెళ్లవలసి ఉంటుందన్నారు. సీసీఐ  ద్వారా పత్తిని అమ్మకమునకు తీసుకొని వచ్చే రైతులు, పత్తి యొక్క తేమ  8 శాతం నుంచి 12 శాతం   నకు మించి ఉండరాదన్నారు. పత్తి యొక్క పింజ రకాన్ని బట్టి 50రూ. తేమ శాతాన్ని బట్టి 81, 82 రూ. రేటు తగ్గుతుందన్నారు. 

ఇది రైతులు గమనించలని,  పత్తి అమ్ముకోవడానికి వచ్చే రైతులు తమ పత్తిని తమ  కల్లాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకొని రావాల్సిందిగా విన్నపము చేస్తున్నామన్నారు. సీసీఐ  కేంద్రానికి అధిక తేమశాతంతో పత్తిని తీసుకొని వచ్చి రైతులు ఇబ్బంది పడవద్దని కోరుచున్నాము అని,  అకాల వర్షాల కారణంగా ముందుగానే ప్రారంభించవలసిన  సీసీఐ కొనుగోలు కేంద్రాలను తేదీ 31/10/2025  శుక్రవారం రోజున ప్రారంభించబడుతుందన్నారు. రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రానికి అమ్మకానికి తీసుకువచ్చే రైతులు, కౌలు రైతులు ముందుగా వ్యవసాయ అధికారులను సంప్రదించి  కిసాన్ యాప్ లో వ్యవసాయ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా  రైతులు ముందుగానే స్లాట్ బుకింగ్  చేసుకొని, ఈ కిసాన్ కపాస్ యాప్ నందు ముందుగానే పట్టా పాస్ బుక్ , ఆధార్ కార్డు , బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ను జత చేయవలసి ఉంటుంది.

ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకున్న తేదీ రోజున అనివార్య కారణాల చేత పత్తిని అమ్ముకోవడానికి రాని ఎడల తిరిగి అదే రోజు స్లాట్ బుకింగ్ క్యాన్సల్ చేసుకోవలసి ఉంటుందన్నారు. ఈ సౌకర్యం రైతు సహోదరులకు మూడు పర్యాయాలు ఉంటుందనీ, . మూడు పర్యాయాలు ముగిసిన అనంతరం రైతుల స్లాట్ బుకింగ్ నిలిపివేయబడుతుందన్నారు.  తిరిగి చేసుకోవాలంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించిన పిదపనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -