డిప్యూటీ కమిషనర్ జి ఉమా ప్రకాష్..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
వీధి వ్యాపారుల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేస్తున్నామని జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ జి ఉమా ప్రకాష్ అన్నారు. శుక్రవారం అబిడ్స్ జిహెచ్ఎంసి కార్యాలయంలో యు సి డి ఆధ్వర్యంలో టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గోషామహల్ సర్కిల్ పరిధిలోని వీధి వ్యాపారులు(స్టీట్ వెండర్స్ ) వ్యాపారం చేసుకునేందుకు జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్ జోన్, రెడ్ జోన్, అంబర్ జోన్ లు త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. ట్రాఫిక్ కు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీధి వ్యాపారులు జిహెచ్ఎంసికి సహకరించాలని కోరారు.
వీధి వ్యాపారుల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు అందించేందుకు యు సి డి కృషి చేస్తుందని డిపిఓ లక్ష్మీబాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, టౌన్ ప్లానింగ్ ఏసిపి తల్లోజు రమేష్, యు సి డి డి పి ఓ లక్ష్మీబాయి, సీ ఓ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ మహేందర్, ట్రాఫిక్ ఎస్ఐ, లాండ్ ఆర్డర్ ఎస్ఐ, నేషనల్ ఆకర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మీర్ఇనాయత్ ఐల్ బాక్రి, ఆకర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫాషా, ఆర్ పి లు శారదా, మమత, అనిత, సుమ ,నాగ శ్రీ ,రాజేశ్వరి ,రమాదేవి, నాగమణి, సంగీత ,విజయ, స్టీట్ వెండర్స్ ప్రతినిధులు లక్ష్మణ్ యాదవ్ నర్సింగ్ రావు , కన్నె స్వామి, అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
వీధి వ్యాపార అభివృద్ధి కోసం జోన్ల ఏర్పాటు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES