భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా, డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై, మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సందర్భంగా చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ,’ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ టైటిల్ చూసి యూత్ వస్తారని అనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తున్నారు. భూమిక, సారా అర్జున్ అందుకు కారణం కావచ్చు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా నుంచి ఏదైతే ఆశించామో అది వస్తుంది.
రెగ్యులర్ కమర్షియల్ పంథాలో కాకుండా, ఎలాంటి ఫార్ములా ఫాలో కాకుండా హార్డ్ హిట్టింగ్ చెప్పాలని అనుకునే ప్రయత్నించాం. మిత్రులందరూ అభినందిస్తున్నారు. రెగ్యులర్ ఫార్మేట్‌ను వదిలేసి కొత్త నటీనటులతో ఇంత పెద్ద స్కేల్‌లో సినిమా చేయటం సాహసమని అందరూ అంటున్నారు. ఇంత బోల్డ్ కంటెంట్‌ను ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు అభినందించేలా సినిమాను చేశామని అంటున్నారు. గుణశేఖర్‌ను కొత్తగా చూస్తున్నామని అప్రిషియేట్ చేస్తుంటే చాలా గొప్ప ప్రశంసగా అనిపిస్తుంది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని ఈ సినిమాతో ప్రయత్నించాను. ఆ ప్రయత్నాన్ని ఈరోజు చాలా మంది అభినందిస్తున్నారు’ అని అన్నారు.
‘యుఫోరియా’కు అద్భుత స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



