Sunday, April 5, 2026
E-PAPER
Homeసమీక్షయూరోప్‌ యాత్రానుభవాలు

యూరోప్‌ యాత్రానుభవాలు

- Advertisement -

విజయా రంగనాథం గారు రచించిన ఈ ”కాలపు చరిత్రలో అడుగులు” పుస్తకం ఒక సాధారణ యాత్రా చరిత్ర కాదు. ఇది చరిత్ర, సంస్కృతి, మానవీయ అనుభవాల సమ్మేళనం. యూరప్‌ దేశాలలో వారు చేసిన ప్రయాణం- లండన్‌, పారిస్‌ ,బ్రస్సేల్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ వరకు విస్తరించిన యాత్ర , కేవలం దృశ్యాలను వర్ణించడమే కాకుండా ప్రతి స్థలం వెనుక ఉన్న చారిత్రక లోతులను కూడా తెలియజేస్తుంది. వీరు ముందుగా హైదరాబాద్‌ నుండి ముంబైకి చేరుకొని అక్కడి నుండి ఫ్లైట్‌ ఎక్కి లండన్‌ చేరుకుంటారు.

లండన్‌ హై గేట్‌ సిమెట్రీ, రాయల్‌ అబ్జర్వేటరీ గ్రీన్విచ్‌ మ్యూజియం, రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌ ,బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌, వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బే, పార్లమెంట్‌ హౌస్‌ స్ట్రీట్‌, లండన్‌ బిగ్‌ బెన్‌, లండన్‌ బ్రిడ్జెస్‌, మేడం తుస్సాడ్‌ మ్యూజియం, లండన్‌ ఐ మిలినియమ్‌- ఇవన్నీ చూసుకొని ప్యారిస్‌ కు వస్తారు. అక్కడ నెపోలియన్‌ గ్రాండ్‌ ఆర్చ్‌, పారిస్‌ నేషనల్‌ అసెంబ్లీ, ప్యారిస్‌ వెండోమ్‌ మెమోరియల్‌ కాలమ్‌, పారిస్‌ సేన్‌ రివర్‌ చూసుకొని, అక్కడినుండి బెల్జియం లోని బ్రుస్సేల్‌ కు చేరుకుంటారు. బ్రుస్సేల్‌ లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసుకొని, జర్మనీకి వచ్చి కోలొన్‌ క్యాథడ్రల్‌ ,బ్లాక్‌ ఫారెస్ట్‌, రైన్‌ రివర్‌ క్రూజ్‌ సందర్శించి -స్విట్జర్‌ ల్యాండ్‌ లోని జ్యూరిచ్‌ సిటీకి ప్రయాణమవుతారు.

ప్రకృతి సంపదకు నిలయమైన స్విట్జర్లాండ్‌ లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి రెండు పర్వతాలను అధిరోహించి – స్విస్‌ బ్యాంక్‌, లయన్‌ మ్యానోమెంట్లను చూసుకొని తిరుగు ప్రయాణమై ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటారు. విజయా రంగనాథం గారు అన్ని అంశాలను సూక్ష్మంగా పరిశీలించి సాధారణ పాఠకునికి అర్థమయ్యేలా వివరించారు. వారి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, వీసాలు, ఆరోగ్య సమస్యలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఇవన్నీ యాత్రికులకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. మంచి పేపర్‌ మీద కలర్‌ ఫోటోలతో ముద్రించిన ఈ పుస్తకం, ఆకర్షణీయంగా తయారై చదివింపజేస్తుంది.

కె.పి.అశోక్‌ కుమార్‌
9700000948

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -