నవతెలంగాణ – రాయికల్
ప్రజాప్రతినిధుల పదవులు ప్రజాసేవ కోసం ఇవ్వబడిన బాధ్యతలు మాత్రమే,ప్రత్యేక హక్కుల గుర్తులుగా కాదు. అయితే మాజీ ప్రజా ప్రతినిధులు పదవి ముగిసిన తరువాత కూడా తమ వాహనాలపై ఎంఎల్‌సీ స్టిక్కర్ ఉంచడం కొనసాగిస్తున్నారు. బుధవారం రాయికల్ పట్టణంలోని ఓ పెయింట్ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉపయోగిస్తున్న కారుకు ముందు భాగంలో ఎమ్మెల్సీ స్టిక్కర్.వెనుక వైపు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో చూపరులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.ప్రోటోకాల్ నియమాల ప్రకారం పదవిలో ఉన్నంతకాలం మాత్రమే అధికారిక గుర్తులు వాహనాలపై ఉంచవచ్చు.పదవి గడువు పూర్తయ్యాక వాటిని తీసివేయడం తప్పనిసరి.లేకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానా,లేదా ఇతర చర్యలు తీసుకోవచ్చు.ఇలాంటి గుర్తులు కొనసాగించడం ప్రజల్లో తప్పుదోవ చూపడమే కాక,ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగంగా పరిగణించబడుతుంది.అధికారులు, పోలీసు విభాగం ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పదవి ముగిసినా.. తీయని ఎమ్మెల్సీ స్టిక్కర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES