Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఏండ్లు గడిచినా.. మారని అధికారి వైఖరి

ఏండ్లు గడిచినా.. మారని అధికారి వైఖరి

- Advertisement -

ఇంకెప్పుడు ఇక్కడి నుంచి బదిలీ అవుతారని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
అయిన వారికి “ఆకుల్లో కాని వారికి కంచాల్లో” అనే పద్ధతిన వ్యవహరిస్తున్న “ఆ” అధికారి
సంవత్సరాలు గడుస్తూన్న ఒకే చోట ఉద్యోగం, 
ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, చర్యలకు జంకుతున్న ఉన్నతాధికారులు
నవతెలంగాణ – కాటారం

కాటారం మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆ అధికారి ఆడింది ఆట పాడింది పాట. తనకు నచ్చిన వారికి నచ్చిన విధంగా సామాన్య, బీద రైతులకు నిత్యం యూరియా అవసరమున్న కూడా 5, 6 ఎకరాలు ఉన్నవారికి సైతం ఒకటి, రెండు యూరియా బస్తాలే ఇప్పిస్తూ, రోజు నిత్యం ఆ పేద రైతులు లైన్లో ఉండే విధంగా తన పని విధానం ఉంది. వచ్చిన కొద్దిపాటి యూరియా బస్తాలను అధికారంలో ఉన్నవారికి పంపుతున్నాడు. కొందరికి అయితే 2,3 ఎకరాలు కూడా లేని వాళ్ళ పేరు మీద కూడా..తనకు నచ్చిన వారికి, ఎన్ని కావాలంటే అన్ని పంపుతున్నాడు. మరికొందరికి అయితే తంబు పనిచేస్త లేదని, అనధికారికంగా తనకు ఇష్టం వచ్చినట్లు డిజిటల్ మీటర్ పనిచేస్తలేదని చెబుతున్నాడు.

ఎలాంటి రికార్డు కూడా చేయకుండా, వారి ఆటోలలో యూరియా బస్తాలు వేయించి పంపించడం ఈ అధికారికే చెల్లుతుంది. ఇవన్నీ సాయంత్రం ఏడు దాటిన తర్వాత జరిగే తతంగాలని, ఆయన పనులని చూస్తే ఆ పేద రైతులు ప్రతిరోజు పిఎసిఎస్ బ్యాంకు ముందు ఏడవడమే తక్కువ అవుతుంది. ఒక యూరియా విషయంలోనే కాకుండా వడ్ల కొనుకోలు కేంద్రాలలో కూడా తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తాలు పేరిట పేద, సాద రైతుల కడుపు కొడుతున్నాడు. రైతులకు ఇచ్చే రుణాల విషయంలో తనకు పర్సంటేజ్లు ఇచ్చిన వారికే రుణాలు ఇప్పిస్తున్నాడు. వీటన్నిటి కారణాల రీత్యా రైతుల నుండి ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలాంటి అధికారి ఇంకెన్ని సంవత్సరాలు గా”స్థానచలనం” లేకుండా ఇక్కడే ఉద్యోగం చేపిస్తారో తెలుసుకోవాలని జిల్లా డిసిఓను చరవాణిలో వివరణ కోరాము. ఇందుకు ఆయన స్సందిస్తూ.. పిఎసిఎస్ కాటారంపై విచారణ చేపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రామిల్ల రాజబాపు

 కాటారం కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అక్రమాలకు అడ్డాగా మారిందని, ఆ అధికారిదే పెత్తనమంతా చెలాయిస్తున్నాడని, వడ్ల కొనగోలు కేంద్రాల్లో గాని యూరియా విషయాలలో ఆ అధికారి చెప్పిందే వేదం అని అన్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆ అధికారి జలుం చెలాయిస్తున్నాడని, మూడు సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ 15 సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. పై అధికారులు తక్షణమే స్పందించి ఆ అధికారిపై స్థానిక విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad