- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విమాన ఇంధన కల్తీపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ బీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ఇంధనాన్ని కూడా కల్తీ చేస్తున్నారని చెప్పారు. గాలిలో ఉండగా.. కల్తీ ఇంధనం వల్ల సమస్య తలెత్తితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలుస్తాయని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ గురునాథం కంపెనీ ట్యాంకర్లలో విమానం ఇంధనం కల్తీ జరిగిందని ఐవోసీఎల్ చర్యలు తీసుకుంది. దీనిపై గురునాథం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.
- Advertisement -