Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఓ మహిళను చెట్టు కట్టేసినా మరో మహిళ

ఓ మహిళను చెట్టు కట్టేసినా మరో మహిళ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో గేదెలు, గొర్రెలు ఇంట్లోకి వచ్చి బియ్యం పాడు చేస్తుందనే విషయంలో గొడవ జరగగా ఓ మహిళను చెట్టుకు కట్టేసి బూతు మాటలు తిడితే చంపేస్తారని బెదిరించిన వారిపై మోపాల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో మోపాల్ ఎస్సై సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ సవిత ఇంటి వాకిలి ముందర పెరిక పోశెట్టి  స్థలం కలదు. ఆ స్థలం లో లక్ష్మి తన గేదెలను, గొర్రెలను కట్టివేస్తున్నది.

ఈ క్రమంలో ఆగస్టు 12వ తేదీ రాత్రి 7 గంటలకు లక్ష్మీ గేదెలు, గొర్రెలు సవిత ఇంట్లోకి వెళ్లి బియ్యం పాడు చేయగా సవిత లక్ష్మితో అడిగినందుకు లక్ష్మి సవితను బూతు మాటలు తిట్టి మంత్రాలు చేస్తున్నావని అన్నందుకు సవిత గుడి మీద ప్రమాణం చేద్దామని గేదెను తీసుకొని గుడి వద్దకు వెళ్ళగా అక్కడికి వచ్చిన లక్ష్మి గేదే తాడును విప్పి సవితకు చుట్టి చెట్టుకు కట్టివేసినది. ఈ సందర్భంగా లక్ష్మి కొడుకు గంగాధర్, భర్త గంగాధర్, కోడలు మమతలు గుడి వద్దకు వచ్చి సవితను ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు తిట్టి చంపి వేస్తామని బెదిరించారని సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుస్మిత తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad