– మెడికల్ టూరిజంతో ఆదాయం పెరుగుదల : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వాలు మారినా విధానాలను మార్చాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఓ ప్రయివేటు మీడియా సంస్థ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టైమ్స్ హెల్త్ ఎక్స్‌లెన్స్ అవార్డు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ డాక్టర్లకు సమాజంలో ఉండే గౌరవం వేరే ఏ వృత్తిలోనూ లేదన్నారు. తల్లి జన్మనిస్తే పునర్జన్మని ఇచ్చేది డాక్టర్లేనని చెప్పారు. డాక్టర్ కావాలంటే ఎంతో కష్టపడాలనీ, ఎన్నో త్యాగాలు చేయాలని అన్నారు. హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం పెరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారని వివరించారు. ఇలాంటి అవార్డు కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లను కూడా సత్కరిస్తే బాగుంటుందని సూచించారు. మెడికల్ టూరిజంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ప్రజలకు మంచి వైద్యం కూడా అందుతుందని వివరించారు.
ప్రభుత్వాలు మారినా విధానాలు మార్చనసరం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



