పొలిటికల్ గా టెంప్ట్ కావొద్దు
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
నాది స్టేట్ ఫార్వర్డ్ రాజకీయం
హరీశ్‌రావు వెనుకపోటు రాజకీయం
హరీశ్‌రావు వల్లనే పార్టీ మారారనే కవిత స్టేట్‌మెంట్ సరిగాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘సీఎం అవుతా అని ఎవరైనా అంటే నాకు సిగ్గు అవుతున్నది. ఏం అనుకుంటున్నారో ఏమో? అలాంటి మాటలు విటుంటే చిరాకు వస్తున్నది. నేను కొంత డిస్ట్రబ్ అయిన మాట వాస్తవం. అందుకే ఎవరి ఫొటోలు వద్దు రాహుల్ గాంధీ ఫొటో ఒక్కటే పెట్టండి అని చెప్పిన. అన్నీ ఇప్పుడే చెప్పను. సమయం వచ్చినప్పుడు చెప్తా. మొత్తం మీద డిస్ట్రబ్‌లో ఐతే ఉన్నా. మేలో అసలు విషయం చెప్తా. ఎవరి వల్ల డిస్ట్రబ్ అయినది చెప్తా. పొలిటికల్‌గా ఎప్పుడూ టెంప్ట్ కావొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. వార్ ప్రకటిస్తే కొనసాగించాలి. మే వరకు వ్యూహం రచించే పనిలో ఉంటా. ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి రాను. ముందకేవెళ్తా. ప్రచార కమిటీ చైర్మెన్ పదవిపై పెద్దగా ఆసక్తి లేదు’ అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బాంబు పేల్చారు. హరీశ్‌రావు మీద కోపంతో బీఆర్‌ఎస్ పార్టీని జగ్గారెడ్డి వీడారనే కవిత వ్యాఖ్యలను కొట్టిపడేశారు. అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడాన్ని మానుకోవాలని సూచించారు. తాను డైరెక్ట్‌గా రాజకీయం చేస్తాననీ, హరీశ్‌రావు వెనుక నుంచి పొడుస్తాడు అంటూ కామెంట్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి టార్గెట్‌గా పనిచేస్తారనీ, రాజకీయంగా ఎప్పుడైనా ఘర్షణ వాతావరణం ఉంటుందని తెలిపారు. జగ్గారెడ్డి అసలు పార్టీ ఎందుకు మారాడు అనేది ఎవరికి తెలియదన్నారు. హరీశ్‌రావు మీద కోపంతో, వ్యతిరేకంతో పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కూతురు కాబట్టి కవిత లీడర్ అయ్యిందని విమర్శించారు. తాను క్షేత్రస్థాయి నుంచి రాజకీయంగా ఎదిగానని చెప్పారు. కుటుంబ పంచాయితీలో తనను ఎందుకు ఇరుకిస్తున్నావని కవితను ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కారణమనీ, తన రాజకీయం నచ్చి ఆప్తమిత్రుడు కుసుమ కుమార్ తో కబురు పంపించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తనను తట్టుకోలేకనే ఎస్పీ వ్యాస్‌కు సంగారెడ్డిలో పోస్టింగ్ ఇచ్చారని చెప్పారు. తనను హౌస్ అరెస్టు చేస్తే కసితో జనం ఓట్లేసి గెలిపించారని గుర్తుచేశారు. అప్పుడు వైఎస్ దగ్గరకు తనను కుసుమ తీసుకెళ్లాడనీ, ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. దాని ఫలితంగానే ఐఐటీ, ఫోర్‌లైన్ హైవే వచ్చాయని తెలిపారు. ఐఐటీ కోసం రైతులు అడిగినంత పరిహారం ఇచ్చి అడిగిన 600 ఎకరాల భూమి ఇప్పించామని గుర్తుచేసుకున్నారు. ఐఐటీ ఇస్తా దాని దగ్గర భూమి కొను వైఎస్ సూచిస్తే పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ కూతురుకు అవగాహన, ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్..చంద్ర బాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లినవారేనని గుర్తుచేశారు. జిల్లాలో రాజకీయంగా హరీశ్..జగ్గారెడ్డి మధ్య వార్ నడుస్తూనే ఉంటదని స్పష్టం చేశారు. తాను రాహుల్‌గాంధీతో సభ పెట్టిస్తే హరీశ్‌రావును కేసీఆర్ పిలిచి తిట్టిండని గుర్తుచేశారు. అందుకే ఆ తర్వాత ఎన్నికల్లో తనను హరీశ్‌రావు ఓడగొట్టాలని చూశాడని తెలిపారు. హరీశ్‌రావుది, తనది రాజకీయం వేరుగానీ, పని పురుగులమని అన్నారు.
డిస్ట్రబ్‌లో ఐతే ఉన్నా..మేలో చెప్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



