Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి ఉన్నా..అనాథ పిల్లలకు అన్నం పెట్టడం లేదు

విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి ఉన్నా..అనాథ పిల్లలకు అన్నం పెట్టడం లేదు

- Advertisement -

ఆయన్ను చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి.. తొండలు జొర్రించినా తక్కువే
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

నవతెలంగాణ-సిద్దిపేట
విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఉండి కూడా.. అనాథ పిల్లలకు అన్నం పెట్టడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి, తొండలు జొర్రించినా తక్కువే అంటూ విమర్శించారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని నాసార్‌పుర ఫిల్టర్‌ బెడ్‌ వద్దనున్న అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో హరీశ్‌రావు బ్లాంకెట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టే గుడ్లు, బియ్యంను ఎమ్మెల్యే పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలు చలితో చాలా ఇబ్బందులు పడుతుంటే బ్లాంకెట్స్‌ పంపిణీ చేశామని అన్నారు. రేవంత్‌ రెడ్డి మళ్ళీ గెలుస్తా అని శపథాలు చేస్తున్నారని.. కమీషన్లు కొట్టుడు, చిల్లర మాటలు మాట్లాడటం, పార్టీలు మారడం, సీట్లు కొనడం రేవంత్‌కి అలవాటంటూ విమర్శించారు. ఫార్మాసిటీని తాము ఏర్పాటు చేస్తే.. దాన్ని ఖండించి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మలిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మాటలు మాని, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలంటూ వ్యాఖ్యనించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -