Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సారు చెప్పినా వైన్స్ ల తీరు మారట్లేదు

సారు చెప్పినా వైన్స్ ల తీరు మారట్లేదు

- Advertisement -

6గంటలకు ముందే పర్మిట్ ఓపెన్
•అడిగితే అప్పు తీరేదిట్ల అంటూ సమాధానం
•ఎమ్మెల్యే రూల్స్ బేకాతర్
నవతెలంగాణ-మర్రిగూడ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచిన మొదట్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలు మద్యం బారిన పడి తమ ఒళ్ళును ఇల్లును గుల్లా చేసుకుంటున్నారనే ఉద్దేశంతో నియోజకవర్గ వ్యాప్తంగా వైన్స్ లకు ఒక సిస్టం పెట్టారు. బెల్ట్ షాపులు కూడా పూర్తిగా బంద్ పెట్టాలని పోలీసులకు,బెల్ట్ షాపు నిర్వాహకులకు స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేశారు. మధ్యాహ్నం ఒకటి తర్వాత వైస్ట్ లు ఓపెన్ చేయాలని ఆరు తర్వాత పర్మిట్ రూమ్ కు అవకాశం కల్పించాలని వైన్స్ నిర్వాహకులకు కండిషన్లు పెట్టారు.

నియోజకవర్గ వ్యాప్తంగా వైన్స్ లకు కొత్త టెండర్లకు ముందే ఆయన తన రూల్స్ ను ఇంప్లిమెంట్ చేశారు.మండల మహిళ లోకం ఎమ్మెల్యేకు పాలాభిషేకాలు చేశారు. కానీ ఆ సిస్టం మండలంలో అంతగా ప్రభావం చూపటం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇక తెగిడి చిన వాడికి తెడ్లే దిక్కు అన్నట్టు మండలంలో నేటికీ కొన్ని గ్రామాలలో అక్కడక్కడ గుట్టు చప్పుడు కాకుండా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయంటూ ప్రజలంటున్నారు. ఇక వైన్స్ ల విషయానికొస్తే మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు ఉన్నాయి దుర్గా వైన్స్, సురాపానం వైన్స్, సాయి వైన్స్ లు ఎమ్మెల్యే పెట్టిన కండిషన్లు వైన్స్ నిర్వాహకులు కొంత బ్రేక్ చేస్తున్నాయని ఒకటికి ముందు వైన్స్ లు ఓపెన్ చేస్తున్నారని, 6 గంటలకు ముందే పర్మిట్ సౌకర్యం కల్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ అంశంపై మహిళలతో పాటు మేధావి వర్గం ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన వైన్సులు కూడా ఎమ్మెల్యే పెట్టిన నిబంధనలకు వ్యతిరేకంగా జనావసాల మధ్యలో ఉండి చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇటీవల నియోజవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే వైన్స్ నిర్వాహకులకు మరో మారు తను పెట్టిన రూల్స్ ను పాటించాలంటూ ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరికలు కూడా జారీ చేసారు.ఇక మండలంలోని మూడు వైన్సులు ఎమ్మెల్యే పెట్టిన కండిషన్లో పాటిస్తాయా లేక ఇదే తంతును కొనసాగిస్తాయి అనేది వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -