Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చెట్లు నరికినా.. పట్టించుకోని అధికారులు 

చెట్లు నరికినా.. పట్టించుకోని అధికారులు 

- Advertisement -

అధికారుల పర్యవేక్షణ కరువు
నవతెలంగాణ – రామారెడ్డి 
: చెట్లు ఉంటే క్షేమం అని, చెట్లను పెంచాలని ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గ్రామపంచాయతీ తోపాటు అడవి శాఖ అధికారులు మొక్కలు నాటుతుంటారు. మొక్కలు వృక్షాలుగా మారి, వృక్షాలను తొలగిస్తున్న అధికారులు పర్యవేక్షణ కరువై వృక్షాలను నరికివేసిన పట్టించుకున్న పాపాన పోలేరు. రామారెడ్డి మండలంలోని మద్దికుంట మర్రి నుండి రెడ్డిపేట తాండవరకు అడవి శాఖ ఆధ్వర్యంలో, మొక్కలు నాటి వృక్షాలుగా ఏపుగా పెంచారు, గుర్తుతెలియని దుండగులు కొన్ని చెట్లను గత కొన్ని రోజుల క్రితం నరికివేసి నేలమట్టం చేశారు. అడవి అధికారులు ఇప్పటివరకు పర్యవేక్షణ చేయక, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిధుల నిర్వహణకు నిదర్శనంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి, మొక్కలను తొలగించకుండా స్థానిక సిబ్బందితో అవగాహన కల్పిస్తూ, స్థానిక అధికారులను పర్యవేక్షిస్తూ మొక్కలను, చెట్లను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఘటనపై నవ తెలంగాణ డిఎఫ్ఓ దివ్య ను వివరణ కోరగా .. ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని, మీ ద్వారా మా దృష్టికి వచ్చిందని, సంఘటన స్థలాన్ని పర్యవేక్షించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad