రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఈనెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ‘ఈ సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎన్నో రకరకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ సిరీస్‌లో చేసిన క్యారెక్టర్ మాత్రం మైల్‌స్టోన్‌లా నిలుస్తుంది. ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి’ అని అన్నారు.
‘జీ5లో నాకు జయంత్, అనురాధా మేడం ఇచ్చే సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు రాజీవ్ కనకాల ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు. అయితే ఈ సిరీస్ చూసిన తరువాత నాకు ప్రసాద్ రావు మాత్రమే కనిపించారు. పాత్రలో ఎంతో ఇమిడిపోయారు. ఉదయ భాను పోషించిన క్యారెక్టర్ ఎంతో బాగుంటుంది. ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అయ్యే సిరీస్ ఇది. ప్రతీ ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరి వరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది’ అని నిర్మాత కె.వి.శ్రీరామ్ చెప్పారు. దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ, ‘అనురాధ మేడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడకు వరకు వచ్చింది. ‘రెక్కి’ తరువాత నేను ఈ కథనే రాశాను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు. ‘నేను ఇందులోని కథకు, క్యారెక్టర్‌కు ఎంతో కనెక్ట్ అయ్యాను. పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ప్రతీ కుటుంబం, ప్రతీ పేరెంట్, ప్రతీ కూతురు చూడాల్సిన సిరీస్. ఇప్పుడున్న సమాజానికి ఈ సిరీస్ ఎంతో అవసరం’ అని ఉదయ భాను తెలిపారు.
ప్రతి తండ్రి కనెక్ట్ అవుతాడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



