– నవతెలంగాణ ఎల్లవేళలా ప్రజాపక్షమే
– క్యాలెండర్ ఆవిష్కరణలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సిద్దిపేట
ప్రతి అక్షరమూ బడుగు, బలహీన వర్గాల కోసం రాస్తున్న ఏకైక పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవతెలంగాణ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుదినం జనస్వరం అనే నినాదంతో ప్రతిరోజూ ప్రజల సమస్యలను, సూచనలను వార్తల రూపంలో అందిస్తున్నదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారిధిగా పనిచేస్తున్నదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, సుడా మాజీ చైర్మెన్ రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, నవతెలంగాణ ఉమ్మడి జిల్లా మేనేజర్ రేవంత్‌కుమార్, విలేకరులు, సిబ్బంది శ్రీనివాసు గుప్తా, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అక్షరమూ బడుగు, బలహీన వర్గాల కోసమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



