- Advertisement -
![]() |
నవతెలంగాణ – భిక్కనూర్
రైతులు పండించిన వరి పంటలో ప్రతి గింజలు కొనుగోలు చేయాలని ఆర్డిఓ వీణ అధికారులకు తెలిపారు. బుధవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అకారణంగా కురిసిన వర్షానికి వరి పంట తడిసి ముద్దవ్వడంతో వరి ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి గింజను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, వ్యవసాయ అధికారులు, రైతులు, సొసైటీ డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.
- Advertisement -