– గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు
నూతన సర్పంచుకు ఘన సన్మానం
నవతెలంగాణ – డిచ్ పల్లి
సైబర్ నేరాలు, డ్రగ్స్, భద్రత వారోత్సవాలపై గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తే.. పోలీస్ శాఖ నుంచి అవగాహన కల్పిస్తామనిడిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ ఆరీఫ్ సూచించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీవో రాజ్ వీర్ ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయంలో సర్పంచులతో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మహమ్మద్ ఆరిఫ్ అవగాహన లేకపోవడం వల్లనే అనేక మంది సైబర్నేరాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్ సతీష్ రెడ్డి ఎంపీడీవో రాజ్ వీర్, ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు పరిష్కారిస్తామని చెప్పారు.
మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసుబాబు మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికయిన సర్పంచ్లలో యువత ఎక్కువగా ఉన్నారని, అధికారుల సహాకారంతో గ్రామాలను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారులు ఎల్లప్పుడూ సహజ సహకారం అందజేసి అభివృద్ధిలో పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమం లో భాగంగా అన్ని గ్రామాల సర్పంచులను అధికారులు సన్మానించారు. అనంతరం సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులందరికీ శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, ఆ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



