నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందికి సూచించారు. మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి తో కలిసి ఏసిపి సదానందం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఒక ఉద్యోగి ఒక మొక్క, ఏక్ పెడ్ మాకే నామ్ (తల్లి పేరున ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టమన్నారు.
నాటిన ప్రతి మొక్కను జియో ప్యాకింగ్ చేయవలసిన బాధ్యత మొక్క నాటిన ఉద్యోగిదన్నారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా ఎదుగుతాయన్నారు. సమతుల్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు చాలా ముఖ్యమని తెలిపారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో సర్కిల్ కార్యాలయాల్లో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.