ఆర్.కె. సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఈ కథకి ఐడియా ఇచ్చింది ఓ రియల్ పోలీస్ ఆఫీసర్. ‘ది 100’ అనే టైటిల్ సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది.
ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే అద్భుతమైన సందేశం ఉంటుంది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా చూసి అద్భుతంగా ఉందన్నారు. అలాగే పవన్‌కళ్యాణ్‌కి కంటెంట్ బాగా నచ్చి ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ ఇందులో పాత్ర ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వపడేలా ఉంటుంది.
హర్షవర్ధన్ రామేశ్వర మ్యూజిక్ చాలా హెల్ఫ్ అయింది. ‘మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్’ లాంటి సినిమాలు చేశాను. ‘నాయకుడు’ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది.
ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీలవుతారు
- Advertisement -
- Advertisement -