Tuesday, January 20, 2026
E-PAPER
Homeఖమ్మంఒక్కొక్క హామీ నెరవేరుస్తున్నా: ఎమ్మెల్యే జారె

ఒక్కొక్క హామీ నెరవేరుస్తున్నా: ఎమ్మెల్యే జారె

- Advertisement -

– మహిళా సాధికారత కు నిర్వచనం ఇందిరమ్మ చీరెలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికలు ముందు, తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఆయన మంగళవారం అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలో రూ.84 లక్షల వ్యయంతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీఆర్ఆర్ పధకంలో భాగంగా నిర్మించిన సీసీ రోడ్ లను ప్రారంభించారు.

మున్సిపాల్ కమీషనర్ బి.నాగరాజు అద్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ చీరెలు మహిళా సాధికారతకు నిర్వచనం అని,మహిళలు చేత,మహిళలు కోరకు ఈ చీరెలు రూపొందుతున్నాయని హర్షం వ్యక్తం చేసారు. మున్సిపాల్టీ పరిధిలో 6960 చీరెలు కు గాను 4540 చీరెలు పంపిణీ చేసామని కమీషనర్ నాగరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ,డీఈఓ నాగలక్ష్మి, డీఎంసీ రాజేష్,టీఎంసీ సంతోష్ కుమార్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, జూపల్లి రమేష్, మొగళ్లపు చెన్నకేశవరావు జేష్ఠ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -