Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలి: ఒడ్డెన్న

ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలి: ఒడ్డెన్న

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకోవాలని ఇంటర్ విద్యాశాఖ జిల్లా ప్రత్యేక అధికారి ఓడ్డెన్న తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, కళాశాలలో చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కళాశాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు. సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలి, కళాశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి రాధాదేవి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -