– మండల విద్యాధికారి ఆంధ్రయ్య
– అభ్యాసన సామర్థ్యాల సాధనపై ఉపాధ్యాయులకు శిక్షణ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక భాష, గణిత, పరిసరాల విజ్ఞానంలో అభ్యాసన సామర్థ్యాల సాధనపై ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు 5రోజుల శిక్షణ కార్యక్రమం ఆయన ప్రారంభించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఆంధ్రయ్య కోర్సు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదిలో బోధనాభ్యాసన ప్రక్రియలు సమర్థవంతంగా నిర్వహించబడాలంటే ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలన్నారు.మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా కృత్యాధార విద్యా బోధన చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఎస్ సిఈఆర్ టి డైరెక్టర్ ఆదేశాల ప్రకారం వేసవి కాలం అయినందున శిక్షణకు హాజరైన ఉపాధ్యాయుల సౌకర్యం కోసం కూలర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.శిక్షణ ఇస్తున్న రిసోర్స్ ఉపాధ్యాయులకు, శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు మధ్య మంచి అర్ధవంతమైన చర్చ కొనసాగినట్లు కోర్స్ డైరెక్టర్, ఎంఈఓ నేర ఆంధ్రయ్య తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ గా పి.చంద్రశేఖర్, జి.రవీందర్, జె.వేణుగోపాల్, సిహెచ్.శంకర్ గౌడ్, పి.ప్రసాద్, ఎల్. సంతోష్, డి.అశోక్, ఎన్.మారుతి, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా నేర్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES