– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
– మండల స్థాయి అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి గ్రామ పంచాయతీలో 100 మంది కూలీలకు తగ్గకుండా పని కల్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీలలో విత్తనాలు విత్తడం, ప్రతి గ్రామ పంచాయతీలో 100 మంది కూలీలకు తగ్గకుండా పని కల్పించడం త్వరగా పూర్తి చేయాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు 90 పని రోజులు పని కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించిన వారి వివరాలు ఆన్ లైన్ అప్లోడ్ చేయడం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అర్హులైన లబ్దిదారులను గుర్తించడం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి ఇప్పటివరకు గ్రౌండింగ్ పూర్తికాని లబ్ధిదారుల గురించి,
గ్రామాల్లో మహిళ సమైక్య భవనాల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను సేకరించడం, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ అమీర్ ఖాన్, పంచాయతీరాజ్ ఏఈ రాజన్న, హౌసింగ్ ఏఈ కళ్యాణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఐకెపి సీసీలు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



