తహసీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమైందని మండల తహసీల్దార్ రవికుమార్ అన్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలి నిర్వహించి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు.
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ,ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పలువురు సీనియర్ ఓటర్లను అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ భ్రహ్మేశ్వర్ రావు, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, జిపిఓ గొట్టం నరేశ్, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



