Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి సంక్షేమ పథకం ప్రజల చెంతకు: ఎమ్మెల్యే 

ప్రతి సంక్షేమ పథకం ప్రజల చెంతకు: ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలగాణ – రాయపర్తి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజల చెంతకు చేరుతుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మహబూబ్ నగర్ గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధితో పాటు విద్యా, వైద్యం, రైతన్నల సంక్షేమం అందించాలనేదే తమ యొక్క ధ్యేయం అని ఉపోద్ఘాటించారు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, చేపడుతున్న పాలనకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల నాయకులు పెండ్లి మహేందర్ రెడ్డి, కుంట రమేష్, యేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందుల భగవాన్, చిన్నబోయిన రవి, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -